Breaking News

భారతదేశంలోని 130 కోట్ల మంది హిందువులే

Dec 30, 2019 16:03 by Admin Admin

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. భారతదేశంలోని 130 కోట్ల మంది హిందువులేనంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారంనాడు ధ్రువీకరించారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు వారు తెలిపారు. దీనిపై ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, న్యాయ సలహా తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe