Breaking News

భారత్‌ విజేతగా నిలిచింది

Jan 30, 2020 11:01 by Admin Admin

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20 అభిమానులకు అసలుసిసలు పొట్టి క్రికెట్ మజా అందించింది. అటు నిర్ణీత 20 ఓవర్లలోనూ ఆపై సూపర్ ఓవర్లోనూ ఆఖరి బంతికి వరకు నరాలు తెగే ఉత్కంఠకు లోను చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సిరీ్సను నిర్ణయించే కీలక పోరులో విశ్వరూపం ప్రదర్శించాడు. మొదట వాయువేగంతో హాఫ్ సెంచరీ చేసిన హిట్మ్యాన్ సూపర్ ఓవర్ చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచి మ్యాచ్కు తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంతకుముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫోర్లు, సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ను విజయం అంచుల దాకా నడిపించినా, షమి మ్యాజిక్కు వెనుదిరగడం జట్టును దెబ్బ తీసింది. దాంతో టై అయిన మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీయగా అంతిమంగా భారత్ విజేతగా నిలిచింది.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe