Breaking News

370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నో

Mar 03, 2020 07:12 by Admin Admin

ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి రాజ్యాంగబద్ధతపై విచారించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం కావాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విస్తృత ధర్మాసనానికి ఇవ్వాల్సిన కారణమేమీ కనబడటం లేదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్, జమ్మూ కశ్మీర్‌ హైకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌లు కలసి  దాఖలుచేశాయి. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe