Breaking News

ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి

Mar 21, 2020 11:58 by Admin Admin

 ప్రపంచ దేశాలపై ప్రమాదకర  Corono virus కోరలు చాస్తోంది. వైరస్‌ బారిన పడిన మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగా ఆ సంఖ్య శనివారం ఉదయానికి 11,310కు చేరింది. ఇక 2,72,351 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ఇటలీలో మృతుల సంఖ్య నాలుగువేలకు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 627 మంది కన్నుమూసినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. అలాగే, కేసుల సంఖ్య 47 వేలు దాటింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 1433కి చేరింది. అమెరికాలోనూ కోవిడ్‌ మృతుల సంఖ్య 200 దాటిపోయింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe