Breaking News

యూపీ సీఎం కీలక నిర్ణయం

Mar 21, 2020 16:57 by Admin Admin

దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ కరోనా ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, రోజువారి కూలీలపై ప్రభావం పడకుండా ఉండేందుకు వారికి సాయం ప్రకటించింది. దాదాపు 35 లక్షల మంది రోజువారి కూలీలకు నిత్యావసరాల కోసం రూ. 1000 ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చాలా మంది ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వాలు ఆదేశిస్తున్న సమయంలో ఈ నిర్ణయం పేదలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe