Breaking News

పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

Mar 21, 2020 17:04 by Admin Admin

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా తరువాతి తరగతులకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ శుక్రవారం ప్రకటించారు. తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల మిగిలిన పరీక్షలను ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి ఉపాధ్యాయులు మినహా మిగతా టీచర్లు ఇంటి నుంచే పని చేయాలని గైక్వాడ్‌ సూచించారు.   

Facebook like
Google Plus Circle
Youtube Subscribe