Breaking News

కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌

Mar 23, 2020 12:08 by Admin Admin

కరోనాపై వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ రాగా అతడు కోలుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని ప్రభుత్వం తెలిపింది. అయితే వారిలో 11,206 మంది స్వీయనిర్భందంలో ఉన్నట్లు వెల్లడించింది. 2,222 మందికి హోమ్‌ ఐసోలేషన్‌ పూరైనట్లు.. మరో 11026 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ వైద్యులు 178 శాంపిళ్లను పరీక్షించగా 150 శాంపిళ్లు నెగిటివ్‌ వచ్చాయి. మరో 22 శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe