Breaking News

మూడో దశకు సిద్ధంగా ఉండండి

Mar 23, 2020 12:11 by Admin Admin

మూడో దశ ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తున వైరస్‌ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. కాగా చైనాతో పోలిస్తే భారత్‌లో జనసాంద్రత చాలా ఎక్కువ. మన దేశంలో ఒక చదరపు కిలోమీటర్‌ పరిధిలో 420 మంది నివశిస్తున్నారు. చైనాలో ఆసంఖ్య 148. అయితే భారత్‌లో రెండోదశ దాటి.. మూడోదశకు చేరితే వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో మురికివాడలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎజెన్సీ ప్రాంతాలూ ఎక్కువనే. దీంతో రెండోదశను దాటి మూడోదశకు చేరకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe