Breaking News

కోవిడ్‌ 19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు

Mar 24, 2020 19:24 by Admin Admin

ప్రపంచాన్ని వణికిస్తున్న Corona మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్‌ లెవిట్‌ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని చెప్పారు. చైనాలో ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచ దేశాల్లోనూ కరోనా విస్తృతి మందగిస్తుందని ఆయన పేర్కొన్నారు. చైనా తరహాలోనే అమెరికా సైతం త్వరలోనే కరోనా వ్యాప్తి నుంచి విముక్తి పొందుతుందని, ఇది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం​ కంటే ముందే జరుగుతుందని లెవిట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఆయన ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నిశితంగా అథ్యయనం చేస్తున్నారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు భయాందోళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe