Breaking News

5 లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు

Mar 27, 2020 10:39 by Admin Admin

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గురువారంతో 22 వేల మందిపైనే మృతి చెందారు. వైరస్‌ రోగుల సంఖ్య పోటెత్తుతుండటంతో అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కేసులు 75వేలు మించడంతో అమెరికాలో అయితే మూసివేసినవాటిని సైతం తిరిగి తెరుస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రి చేశారు. లూసియానాలో పార్కులను ఐసోలేషన్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ఓ సమావేశ మందిరాన్ని 4 వేల పడకల ఆసుపత్రిగా మార్చేశారు. ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులు నిండిపోతుండటం, రక్షణ సామగ్రి లేకపోవడంతో  దేశంలో 9 మంది వైద్యులు మృతి చెందారని అధికారులు తెలిపారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe