Breaking News

నేను మ‌ర‌ణించాననుకోండి నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు

Mar 30, 2020 18:20 by Admin Admin

అమెరికాలో ఓ డాక్ట‌ర్ చేసిన మెసేజ్ ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన మ‌హిళా డాక్ట‌ర్ క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోంది. ఆమె వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తూ ఓ సందేశాన్నిచ్చింది. ‘నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు. వారు ఈ సందేశం చ‌ద‌వ‌లేరు. నేను మెడిక‌ల్ సూట్‌లో ఉన్నందున క‌నీసం న‌న్ను గుర్తుప‌ట్టనూలేరు. ఒక‌వేళ‌ నేను కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) వ‌ల్ల మ‌ర‌ణించాననుకోండి. ఒక్క‌టే నేను కోరుకునేది.. వారి త‌ల్లి బ‌తికున్న‌న్నాళ్లూ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న విధులు నిర్వ‌ర్తించింద‌ని తెలుసుకోవాల‌’ని ఆశిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe