Breaking News

బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని

Mar 30, 2020 18:25 by Admin Admin

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలవుతున్నా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులూ తెరిచిఉన్నాయని, ఏటీఎంలు పనిచేస్తున్నాయని సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారని, అవసరమైన చోట శానిటైజర్లను ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని బ్యాంకులు తమ బ్రాంచ్‌లు తెరిచిఉంచి, ఏటీఎంలను నగదుతో నింపుతున్నాయని, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు చురుకుగా పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe