Breaking News

నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది

Apr 07, 2020 12:06 by Admin Admin

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు చిత్రవిచిత్రమైన కేసులు వస్తున్నాయి.   సోమవారం ఉదయం ఓ యువతి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సార్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది..  వెళ్ళేందుకు పోలీసు అనుమతి ఇవ్వండి అంటూ వచ్చింది.  వాస్తవానికి ఆమెను ప్రేమిస్తున్న యువకుడు ఆదివారం ఉదయం అంబర్‌పేట నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12కు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మా అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఆమె మీద తనకు ఎలాంటి ఇష్టం లేదని చెప్పడానికే తానే వచ్చానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే తన బాయ్‌ఫ్రెండ్‌ను తాను కలవాల్సిందేనని అనుమతి ఇవ్వాలంటూ బైఠాయించింది. దీంతో ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు.   

Facebook like
Google Plus Circle
Youtube Subscribe