Breaking News

చైనాలో మళ్లీ వైరస్‌ కలకలం

Apr 13, 2020 10:54 by Admin Admin

చైనాలో మళ్లీ వైరస్‌ కలకలం! శనివారం అక్కడ 99 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 97 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. చైనాలో ఇప్పటివరకూ ఇలా విదేశాల నుంచి వచ్చిన  1280 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది.  చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గి విదేశాల్లో పెరుగుతుండడంతో ప్రభుత్వం వారిని చైనాకు తరలించింది. అలా తరలించిన వేలాదిమందిలో 1280 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. వారిలో 481 మందికి నయంకాగా.. 799 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 36 మంది పరిస్థితి విషమంగా ఉంది. వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ లేనివారివల్ల పెను ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని.. మరికొన్నాళ్లపాటు సామాజిక దూరం పాటించాలని, ఎక్కువ మంది ఒకచోట కలవకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe