Breaking News

భారత్‌లో ప్రజల త్యాగం వల్లే కరోనా నియంత్రణ

Apr 14, 2020 10:56 by Admin Admin

మే 3వ తేది వరకు Lockdown ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారని చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe