Breaking News

ఓ యువతికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు

Apr 15, 2020 14:59 by Admin Admin

దర్శకుడు Ram Gopal Varma తన సినిమాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే సంగతి తెలిసిందే. నూతన నటీనటులను ఎంకరేజ్‌ చేసే ఆయన.. తాజాగా ఓ యువతికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. తన ట్విటర్‌ అకౌంట్‌లో ఆ యువతి టిక్‌టాక్‌ వీడియోను పోస్ట్‌ చేసిన వర్మ.. ఆమెకు నటనపై ఆసక్తి ఉంటే harishraju0303@gmail.com కు వివరాలు పంపాల్సిందిగా తెలిపారు. కాగా, @aquagirlak టిక్‌టాక్‌ ఐడీ పేరిట పోస్ట్‌ అయిన ఆ వీడియోలో ఓ యువతి.. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన చిన్న బిట్‌ను డబ్‌ స్మాష్‌ చేసింది. దీనికి ఫిదా అయిన వర్మ ఆమెకు నటనపై ఆమెకు ఇష్టం ఉంటే వివరాలు పంపాల్సిందిగా కోరాడు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe