కేంద్రం లాక్డౌన్ 2 మార్గదర్శకాలు విడుదల
Apr 15, 2020 15:42 by Admin Admin
గైడ్‌లైన్స్ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి .
- విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్ .
- రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్.
- దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని పరిశ్రమల నిర్వహణకు అనుమతి.
- పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి.
- నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి.
- కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్‌కు అనుమతి.
- పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి.
- అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతి.
- పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి.
- హాట్స్పాట్లలో నిబంధనలు మరింత కఠినం.
- హాట్స్పాట్లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే.
- హాట్స్పాట్లలో జనసంచారం ఉండొద్దు.
- మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం.
- సభలు సమావేశాలకు అనుమతి లేదు.
- విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు.
- మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత.
- అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్‌పై నిషేధం.
- అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు.
- లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు.
- కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
- 10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం.
- సోషల్ డిస్టెన్స్ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం.
- ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి.
- విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
- వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి.
- ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది.