

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం నాటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 941 కరోనా పాజిటివ్ కేసులు, 37 కరోనా మరణాలు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కు చేరింది. మరణాల సంఖ్య 414కు చేరుకుంది. గత 24 గంటల్లో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు.
గత 24 గంటల్లో 30 వేల కరోనా టెస్ట్‌లు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,90,401 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది.
![]() |
|
![]() |
|
![]() |