Breaking News

ఇల్లు అద్దె అడగొద్దంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Apr 24, 2020 09:00 by Admin Admin

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో అద్దెకుంటున్న వారి నుంచి యజమానులు కిరాయి వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి నుంచి 3 నెలల పాటు అద్దె అడగొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండేలా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది.  చాలా మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని, వారి నెలవారీ సంపాదనలో 40% ఇళ్ల అద్దెలకే పోతుందని పేర్కొన్నది. ప్రస్తుత కష్టకాలంలో వీరి నుంచి అద్దెలు వసూలు చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది.


అద్దెలు చెల్లించలేదన్న కారణంతో ఎవరినీ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించరాదని తెలిపింది. 3 నెలల తర్వాత అద్దె బకాయిలను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని సూచించింది. బలవంతంగా అద్దెలు వసూలు చేసినట్లు, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులొస్తే ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు-1897, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్టు-2005 ప్రకారం శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe