Breaking News

ముందుకు సాగని ప్లాస్మా థెరఫీ

Apr 24, 2020 09:05 by Admin Admin

కొవిడ్‌ చికిత్స కోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్లాస్మా దాతలు దొరక్కపోవడం వల్ల ఈ చికిత్సా విధానం ముందుకు సాగడం లేదు. ప్లాస్మా థెరఫీలో భాగంగా.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దీనిని మరో రోగికి ఎక్కిస్తారు. దీనిలో యాంటీబాడీస్‌ రోగి తొందరగా కోలుకోవడానికి తోడ్పడతాయి. కానీ కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe