Breaking News

కంపెనీలు ఉద్యోగుల కోత

Apr 24, 2020 18:19 by Admin Admin

ప్రాణాంతకమైన కరోనా ప్రభావం వల్ల దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎన్నడులేని విధంగా 26 శాతానికి చేరుకుందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి’ వెల్లడించింది. మున్ముందు దేశంలోని 70 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తాయని, 50 శాతం కంపెనీలు వేతనాలను తగ్గిస్థాయని ‘ఫిక్కీ–ధృవ’ నిర్వహించిన ఓ పారిశ్రామిక అధ్యయనంలో తేలింది. కరోనాను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌’ను ప్రకటించడానికి ముందు వలస కార్మికుల పరిస్థితి గురించి పట్టించుకోవడంలో కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు విఫలమయ్యాయి. పర్యావసానంగా దేశంలో దాదాపు 50 కోట్ల మంది వద్ద నగదు నిల్వలు పూర్తిగా హరించుకు పోవడం, మరో 50 కోట్ల మంది వద్ద నగదు నిల్వలు సగానికి సగం తగ్గాయని దేశ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe