Breaking News

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు

May 06, 2020 12:35 by Admin Admin

టాలీవుడ్ ప్రముఖ నటుడు, `మా` మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయణ్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. శివాజీరాజాకు హఠాత్తుగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్టు వైద్యులు భావిస్తున్నారు. స్టెంట్ వేసే అవకాశమున్నట్టు సమాచారం. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe