Breaking News

విద్యుత్ షాక్ తో రైతు బలయ్యాడు.

Jul 02, 2020 16:15 by Admin Admin

సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని గొందేగావ్ గ్రామానికి చెందిన రైతు N.బాబు(55) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం అతని స్వంత పొలంలో ఉన్న బోరూ బావి స్టార్ట్ చేసినప్పటికీ అది నడవలేదు. బోర్డులో విద్యుత్ సరఫరా లేదని గమనించిన రైతు సమీపంలోని విద్యుత్ ట్రాన్సఫర్మేర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగ సరిచేస్తుండగా   విద్యుత్ తీగల ద్వారా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్స్ వద్ద సమస్య ఉంది మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. వారు రాకపోవడంతో తన తండ్రి స్వంతంగా ట్రాన్స్ఫార్మర్స్ వద్ద మరమ్మతులు చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ షాక్ తగిలి మరణించారని మృతుడి కుమారుడు ఆరోపించాడు. రైతుల బాధలను అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe