Breaking News

సిఎం జగన్ కు లేఖరాసిన మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

Jul 03, 2020 12:29 by Admin Admin

మీరు అడిగిన వారికి, అడగని వారికి హామీలు ఇవ్వని,ఇచ్చిన వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు

మా జాతి చిరకాల కోరిక పోగొట్టుకున్న బిసీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ నేతలు పూర్తి మద్దతు ఇచ్చారు 

2016ఫిబ్రవరి 1 మీడియాలో ఇంటరివ్యూ ఇస్తూ మాజాతి కోరిక సమంజసం అని చెప్పారట

అసెంబ్లీ లో కూడా మద్దతు ఇచ్చారని విన్నాను

ఈరోజు మా కోరిక దానం చేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదు

మీ విజయానికి మాజాతి సహకారం అన్ని చోట్ల పొందలేదా

ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి మాజాతిని,ఉద్యమాన్ని, పోలీసులతో అణచివేసిన దమనకాండ, అరాచకాలు, అవమానాలుమీ ఛానల్ లో చూపించిందే చూపించి మాజాతి ఓట్లు పొందలేదా

పాలకులు ప్రజల కష్టాలలో పాలుపంచుకోవాలి..

నవీన్ పట్నాయక్, జ్యోతిబసు, వైస్సార్ లా పూజలందుకోవాలి కానీ పదవి మూణాళ్ళ ముచ్చటగా చేసుకోకండి

మాజాతి రిజర్వేషన్ల కోసం ప్రధాని మోఢీగారిని కోరండని సిఎం జగన్ కు రాసిన లేఖ లో ముద్రగడ

Facebook like
Google Plus Circle
Youtube Subscribe