Breaking News

సాంప్రదాయ బద్దంగా ఉజ్జయినీ మహాకాళి జాతర

Jul 03, 2020 15:02 by Admin Admin

 సికింద్రాబాద్: సాంప్రదాయ బద్దంగా, శాస్త్ర బద్దంగా ఉజ్జయినీ మహాకాళి జాతర ఆలయ సిబ్బంది, పురోహితులు, ట్రస్ట్  ఆధ్వర్యంలో జరుగుతుంది.  భక్తులేవరికీ కూడా అమ్మవారి ప్రత్యక్ష దర్శనం ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. 


ఉజ్జయినీ మహాకాళి జాతర ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ, దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, స్థానిక నేతలతో ఆలయ ఆవరణలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు..
ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ మహాకాళి జాతర, రంగం, పూజ కార్యక్రమాలు అన్నీ కూడా టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు.. ఎవరి ఇళ్లలో వారే ఉండి అమ్మవారిని దర్శించుకోవాలని అదే విధంగా కరోన మహమ్మారిని పారద్రోలమని వేడుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.. కరోనా మరింత విజృబిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు తగిన జాగ్రత్తలు తీసుకొని తమ ఇళ్లవద్దనే బోనం పూజలు చేసుకోవాలని తెలిపారు. ఇక్కడికి వచ్చి భక్తులు ఇబ్బందులు పడవద్దు, సామాన్య భక్తులతో పాటు నాతో సహా రాజకీయ నేతలు ఎవరికి కూడా ఆలయ ప్రవేశ అనుమతులు ఉండవని వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe