Breaking News

కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం

Jul 04, 2020 15:09 by Admin Admin

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్-   కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి   శ్రీనివాస్ గౌడ్  ఆరోపించారు.
టీపీసీసీ పిలుపు మేరకు శనివారం  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ అమీన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్  కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు   కాట సుధారాణి  మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో  బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరగడం మాత్రం సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉంది ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజల బతుకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని  ఆమె  డిమాండ్ చేశారు.
కరోనా కష్ట కాలంలో ఇండ్లు గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు ధరలను పెంచుతూ ప్రజలకు మరింత కష్టపెడుతున్నారని మండి  పడ్డారు. ఉపాధి, ఉద్యోగాలు లేక, చేతికి సగం జీతాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాట సుధారాణి   పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు  మున్నా , పద్మావతిగోపి, లావణ్య శశిధర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగంగౌడ్   తదితరులు పాల్గొన్నారు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe