Breaking News

ప్రైవేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలతో తెలంగాణా గవర్నర్‌ భేటీ

Jul 07, 2020 15:15 by Admin Admin

ప్రైవేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలతో తెలంగాణా  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భేటీ కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం  ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆస్పత్రుల‌ పని తీరు, చికిత్స అందిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే తమకు ప్రభుత్వం విధించిన చార్జీలు సరిపోవడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన యాజమాన్యాలకు చార్జీలు పెంచెందుకు ప్రభుత్వం నిరాకరించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో పాటు బెడ్స్‌ పరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హస్పీటల్‌ యాజమాన్యాలు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరనున్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe