

కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సచివాలయానికి రానప్పుడు.. కూల్చే అధికారం కూడా లేదన్నారు. ఉమ్మడి ఏపీకి సరిపోయిన సచివాలయం .. తెలంగాణకు సరిపోదా అని ప్రశ్నించారు. వైద్యం అందక కరోనా బాధితులు ఇబ్బంది పడుతుంటే.. కూల్చివేతలకు సమయం కేటాయించటం బాధాకరమన్నారు. ఇదిలా ఉంటే, పాత సచివాలయం కూల్చివేత పనులు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అధికారుల సమక్షంలో సీ బ్లాక్‌ను జేసీబీలు కూల్చివేస్తున్నాయి. సచివాలయం కూల్చివేతతో పాత సచివాలయం వైపు వెళ్లే అన్నిదారులను మూసివేశారు. కూల్చివేతను సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
![]() |
|
![]() |
|
![]() |