రాష్ట్రంలో మద్యం వ్యాపారులు సిండికేట్ (ప్రభూత్వేతర శక్తి) గా ఏర్పడి నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ అధిక ధరలకు మద్యం అమ్మకాలపై ప్రజల్లో వస్తున్న అసహనం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను పరిగణలోకి తీసుకొని "సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా.ముప్పారం ప్రకాశం" ఆధ్వర్యంలో ఏర్పడిన బృందం సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలం, శివ్వంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సాయి గణేష్ వైన్స్ సందర్శించి అందోల్ నియోజకవర్గం మొత్తంలో ఉన్న దుకాణాల్లో ఈ మద్యం విక్రయాలు అక్రమంగా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని దృవీకరించుకున్న బృందం, అక్రమ అధిక ధరలను తక్షణమే అరికట్టాలని, సిండికేట్ గా ఏర్పడిన మద్యం వ్యాపారులతో కుమ్మక్కైన ఎక్సైజ్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ అక్కడే ఉన్న దుకాణంలో మద్యం సిసాలను కోనుగోలు చేసి ధ్వంసం చేశారు.
సిసాల ధ్వంసం అనంతరం స్థానిక ఎక్సైజ్ పోలీసులు ఆందోలన చేస్తున్న సాహసం నాయకుల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కె.యూ. జెఏసి నాయకులు ఎర్రోల్ల పోచయ్య, సాహసం నాయకులు అందెల కృష్ణ, నాగిరెడ్డిపల్లి అనిల్ కుమార్, సి.హెచ్.పోచయ్య, గోపాల్ భూషణ్, విఠల్, సాయి, నర్సింలు, ప్రభాకర్, మల్లేశం తధీతరులు పాల్గొన్నారు.