Breaking News

అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

Jul 07, 2020 15:26 by Admin Admin

కరోనా లక్షణలు ఉన్నాయని మూడు రోజులుగా ఊరు బయట గుడిసెలో నివాసం!

వైద్య అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం!

ఇంట్లో చిన్న పిల్లలు గుడిసెలో తల్లి జీవనం సాగిస్తున్నా వైనం!
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం విట్యాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది విట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళకు గత మూడు రోజుల నుండి దగ్గు,జ్వరం జలుబు కరోనా లక్షణాలు ఉన్నాయని ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో ఆమెను ఊరి బయట గుడిసెలో ఉంచారు ఇక గత మూడు రోజుల నుంచి వైద్య అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అస్సలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే తరుణంలో ఊరికి చివరగా వర్షానికి తట్టుకొని కాలం వెల్లదిస్తుంది ఆ మహిళ ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం ఆమె ఊరి చివర గుడిసెలో జీవనం సాగిస్తున్న ఘటన పలువురిని బాధిస్తుంది..

Facebook like
Google Plus Circle
Youtube Subscribe