Breaking News

అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు

Jul 07, 2020 15:29 by Admin Admin

చిత్తూర్ జిల్లా  :   పుత్తూరు పట్టణ  పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108,104 అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే   రోజా ప్రారంభించారు . దీనిలో భాగంగా 108 వాహ‌నాన్ని రోజా  స్వ‌యంగా న‌డిపారు. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్‌సీపీ కార్య‌కర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.  రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే 108,104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జూలై 1న 1008 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగ‌తి తెలి‌సిందే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe