వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి : కునిగిరి నీలకంఠ
Jul 11, 2020 07:37 by Admin Admin
ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినాయక చవితి ఉత్సవ సమితి కర్నూలు జిల్లా కార్యదర్శి కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు ఆదోనిలో జరుగుతాయని అన్నారు. 22 ఆగస్టు 2020 నాడు వినాయక చవితి పండుగ ఉందని ఆ రోజు నుండి ఐదు రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉంటాయని అలాగే నిమజ్జనం కూడా జరుగుతుందని తెలియజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది వినాయక చవితి జరుగుతుందా లేదా అన్న అనుమానంతో ఉన్నారని, ఈ విషయంలో చాలా మంది యువకులు తనను వ్యక్తిగతంగా సంప్రదించారని తెలియజేశారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తాం అని తెలియజేశారు ఈ విషయంలో ప్రభుత్వ అధికారులతో కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వినాయక చవితి పండుగ విషయంలో మరింత మంది పెద్దలతో కలిసి మాట్లాడతామని, వినాయక చవితి ఉత్సవ సమితి సమావేశాలు కూడా నిర్వహిస్తామని, అనంతరం పండుగ ఎలా చేయాలి అనే నియమ నిబంధనలు తెలియజేస్తామని అన్నారు.