Breaking News

KT రామారావు గారి పిలుపు మేరకు డెంగ్యూ వ్యాధి నివారణ

Jul 13, 2020 09:46 by Admin Admin

రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10  గంటల 10 నిమిషాల కు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో మంత్రుల నివాసంలోని నర్సరీ లో దోమలు  పెరగడానికి అవకాశమున్న  వర్షపునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పూలతొట్టి లోని నీటిని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు స్వయంగా పరిశీలించి, నీటిని తొలగించారు.  దోమలు నివాసం ఉండే ప్రాంతాలైన పూల కుండీలు, వర్షం నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో  మంత్రి నివారణ చర్యలు చేపట్టారు 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు  అవగాహన కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

డెంగ్యూ వ్యాధి నివారణ లో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమానికి పిలుపునిచ్చిన  మంత్రి శ్రీ K T రామారావు గారికి ధన్యవాదాలు తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe