Breaking News

పాతబస్తీలో కరోనా రాపిడ్ టెస్టులు ప్రారంభించిన ఎమ్మెల్యే పాషా ఖాద్రి

Jul 14, 2020 16:42 by Admin Admin

కరోనా వైరస్ భారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ...ఎవరికైనా అనుమానాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో టెస్టులు చేసుకోవాలని యకుతుపురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ అన్నారు. మంగళవారం కూర్మగుడా డివిజన్ మాదన్నపేట్ భరత్ నగర్ కమ్యూనిటి హాల్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కరోనా రాపిడ్ టెస్ట్ సెంటర్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా  ఎమ్మెల్యే పాషా ఖాద్రీ,కూర్మగుడా డివిజన్ కార్పొరేటర్ సమీనా బేగం,డాక్టర్ ఆయేషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా వైరస్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ రాపిడ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్టులు చేయించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్  సభ్యులు కట్ట సుదర్శన్,కూర్మగుడా డివిజన్ అధ్యక్షులు దర్శనం నర్సింగ్ రావు,శివ యాదవ్,అనిత గౌడ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe