Breaking News

శ్రీలంక మత్య్సకారులను వెంటాడి పట్టుకున్నారు

Jul 15, 2020 11:30 by Admin Admin

శ్రీలంక మత్స్యకారులను బోటును కాకినాడ మెరైన్ అధికారులకు అప్పగీంచిన మచిలీపట్నం కోస్ట్‌గార్డ్‌ పోలీసులు

కృష్ణా జిల్లా బందరు సముద్ర తీరం నుంచి  180 నాటికల్‌ మైళ్ల దూరంలో శ్రీలంకకు చెందిన ఇందువర అనే ఫిషింగ్‌ బోట్‌ను కాకినాడ ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. బోటులో ఉన్న ఆరుగురు శ్రీలంక మత్య్సకారులను అదుపులోకి తీసుకున్నారు.  600 కేజీల ట్యూనా చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన ప్రియదర్శిని అనే గస్తీ నౌక బందరు సముద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా , ఐఎంయుఎల్‌-ఏ-1235 ఎంటీఆర్‌ అనే శ్రీలంక బోటులో ఆరుగురు మత్య్సకారులు ట్యూనా చేపలను వేటాడుతుండడాన్ని గమనించారు.

దీంతో బోటును పట్టుకోవడానికి వెళ్లగా, వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు.  కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది ముందు వారి ఆటలు సాగలేదు. అరగంట పాటు శ్రీలంక బోటును వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ట్యూనా చేపలు ప్రత్యుత్పత్తి అయ్యే ఈ సీజన్‌లో వాటిని పట్టుకోకూడదని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, కోస్ట్‌గార్డ్‌ అధికారి ఒకరు చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe