జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడి ,రేణిగుంట మండలం నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 35 సంవత్సరాల 1986 పూర్వం 5 ఎకరాలు, 25 సెంట్లు, స్థలం కేటాయించినది. కానీ ,దీనికి ఎటువంటి కంచెను ఏర్పాటు చేయలేదు. ఈ స్థలము జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం మరియు నివాస యోగ్యమైన నందు వల్ల కాలక్రమేణా కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటు వచ్చారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనేక పర్యాయాలు పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .ఇటీవల దాదాపు 1 ఎకరా స్థలమును ఆక్రమణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు, SMC చైర్మన్ సుబ్బలక్ష్మి , గ్రామస్తులు ఆట స్థలము సందర్శించి ,పరిశీలించి కరకంబాడి పంచాయితీ సెక్రటరీ రామాంజనేయ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడమైనది. సర్వే జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయులు మురళి, సుబ్రహ్మణ్యం ,Aptf నాయకులు వెంకట ముని,శ్రీధర్, భాగ్య శేఖర్ రెడ్డి, మురళి గోపి ,జహంగీర్, తదితరులు పాల్గొన్నారు