రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలకేంద్రంలోని హైదరాబాద్&,బీజాపూర్ జాతీయ రహదారిపై మరియు చేవెళ్ల షాబాద్ చౌరస్తా రోడ్డులో తెరాస పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం షాబాద్ మండలం లోని చందన వెళ్లిలో నూతనంగా వెల్స్ పన్ కంపెనీని ప్రారంభించిన తెలంగాణ ఐటీ&మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కె. తారకరామారావు, పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
తెలంగాణ ఐటీ& మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ షాబాద్ లో వెల్స్ పన్ కంపెనీ పెట్టడం ఆనందంగా ఉందని 2021 వరకు వెల్స్ పన్ గ్రూప్ వారు 2000వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారని ఆయన అన్నారు..
దేశంలోనే రెండు పెద్ద కంపనీలు షాబాద్ పెట్టడంతో ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు...
ఇంకా 4 కంపెనీ లు ఇక్కడే ఏర్పాటు కాబోతున్నందున పారిశ్రామిక హబ్ గా షాబాద్ కాబోతుందని అన్నారు...
షాబాద్ లో త్వరలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు 3600ఎకరాల ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు..దీనితో
ఇక్కడి స్థానిక యువతకు పెద్దపీట వేస్తామని అన్నారు..
షాబాద్ మండలం లోని హైతాబాద్ మరియు సితారాంపూర్ గ్రామాల ప్రజలు సహకరిస్తే 2 పెద్ద కంపనీలు ఏర్పాటు చేస్తామని అన్నారు.