Breaking News

శ్రీ రాఘవేంద్ర స్వామి మహరథోత్సవం ఈ ఏడాది లేదని మఠం అధికారులు తెలిపారు

Jul 25, 2020 21:27 by Admin Admin

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలలో భాగంగా నిర్వహించే మహరథోత్సవం ఈ ఏడాది లేదని మఠం అధికారులు తెలిపారు.

★ ఆగస్టు 2 నుంచి 8 వరకు జరగాల్సిన సప్తరాత్రోత్సవాల్లో కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 

★ ఉత్సవాల్లో పాల్గొనే వారి సంఖ్యను 50 మందికి లోపుగానే పరిమితం చేసి శ్రీమఠం ప్రాంగణంలో శ్రీమఠం సంప్రదాయాలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

★ దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, శిష్యులు, భజన మండళ్లు ఈ ఆరాధన ఉత్సవాలను శ్రీ మఠం యూట్యూబ్ ఛానల్ ‘మంత్రాలయ వాహిని’ లో చూడవలసిందిగా కోరారు. 

★ కరోనా ఉధృతి తగ్గిన వెంటనే ఈ ఆరాధనకు సంబంధించి ఆరాధన సంస్మరణోత్సవం పేరిట వైభవ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు, దీనిని భక్తులు గమనించాలన్నారు. 

★ ఈ ఆరాధన ఉత్సవాల్లో కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. 

★ కావున దర్శనార్థం వచ్చే భక్తులు, శిష్యులు రావద్దని తెలిపారు. 

★ మంత్రాలయంలో ఎటువంటి వసతి, దర్శన భాగ్యం లేవని, భక్తులు గమనించి ఎవరి ఇంటి వద్దే వారే ఉండి రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పోందాలని సూచించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe