Breaking News

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది.

Aug 10, 2020 13:47 by Admin Admin

కరోనా నుంచి కోలుకొని వేల మంది డిశ్చార్జి అవుతున్నా.. అంతే సంఖ్యలో కొత్తగా బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలో 1,47,048 ఉన్నాయి. అత్యధిక యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాతి స్ధానంలో ఆంధ్రప్రదేశ్‌.. 87,112 యాక్టివ్‌ కేసులతో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. రాష్టరంలో కరోనా దెబ్బకు 2036 మంది మరణించారు. అనధికారిక మరణాల సంఖ్య ఇంకా ఉంటుందన్న విమర్శలూ ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లోనూ భారీగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తొలుత ఆ రాష్ట్రాల్లో భారీ కేసులు నమోదైనా ఆ మేరకు డిశ్చార్జిలు పెరిగాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe