Breaking News

మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు​ సంచలన నిర్ణయం

Aug 16, 2020 15:39 by Admin Admin

మహేంద్రసింగ్‌ ధోని తన  రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు శనివారం(ఆగస్టు 15)తో తెరదించాడు. టెస్టుల నుంచి 2014లోనే తప్పుకున్న ధోని అప్పటి నుంచి వన్డే, టీ 20ల్లో కొనసాగుతున్నాడు. 2017లో కెప్టెన్‌ స్థానం నుంచి పక్కకు తప్పుకొన‍్న ధోని ఆటగాడిగా కొనసాగాడు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిసారిగా కనిపించిన ధోని మళ్లీ జట్టులోకి రాలేదు. ఆలోగా కరోనా వైరస్‌ విజృంభణతో క్రికెట్‌ సిరీస్‌లు వాయిదా పడడం జరిగింది. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ధోని రాణించి మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ ధోని తన అభిమానులందరిని షాక్‌కు గురిచేస్తూ ఆగస్టు 15 శనివారం.. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe