Breaking News

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం మెరుగ‌వుతోంది.

Aug 16, 2020 15:43 by Admin Admin

మాజీ రాష్ట్ర‌ప‌తి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(84) ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేద‌ని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ ఆస్ప‌త్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయ‌న‌కు వెంటిలేట‌ర్‌పైనే చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ మాత్రం ప్ర‌ణ‌బ్ ఆరోగ్యం మెరుగ‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్ప‌త్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి ద‌య, మీ ఆశీర్వాదాల వ‌ల్ల ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతోంది. ముందుక‌న్నా ఇప్పుడు పరిస్థితి మెరుగ‌వుతోంది. ఆయ‌న కీల‌క అవ‌య‌వాల‌న్నీ నిల‌క‌డ‌గానే స్పందిస్తున్నాయి. చికిత్స‌కు కూడా స్పందిస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే మ‌న మ‌ధ్య‌కు వ‌స్తార‌ని విశ్వ‌సిస్తున్నా" అని తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe