

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు చేరింది.
![]() |
|
![]() |
|
![]() |