Breaking News

రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్

Sep 29, 2020 19:19 by Admin Admin

రియల్ హీరో, బాలీవుడ్ నటుడు  సోనూసూద్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనూకు ప్రదానం చేసింది. ఇప్పటివరకు అద్భుత నటనకు అవార్డులు ప్రశంసలు గెలుచుకున్న సోనూ తన గొప్ప మనసుకు, మానవత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతోపాటు తాజాగా యూఎన్‌డీపీ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్‌లో  చాలాకొద్దిమందికి దక్కిన అరుదైన గౌరవాన్ని సోనూ అందుకోవడం విశేషం. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe