

యువతకు కొత్త అవకాశాల కల్పన...సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతు...
ధరలు పెరిగేవి తగ్గేవి...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బ...
సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట...లోక్‌సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్...
వనస్థలిపురంలో కంపించిన భూమి...నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీ...
నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్కచేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలపై వంతెనపై నిలపకుండా నిషేదం విధించారు. ఫోటోల కోసం వంతెనపై ఆగితే భారీగా చలనాలు విధిస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై గురువారం సీపీ సజ్జనార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
![]() |
|
![]() |
|
![]() |