Breaking News

ఇక్కడి నుంచి మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది

Oct 22, 2020 09:41 by Admin Admin

నగరాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జనావాసాల మధ్య ప్రవహించే మూసీ ప్రదేశాల్లో ఎత్తయిన గోడలు లేకపోవడంతో నీటిలో మునుగుతున్నాయి. 1908లో వచ్చిన వరదల అనంతరం నీటిలో మునిగిన, కొట్టుకుపోయిన బస్తీల వద్ద మూసీ ఇరువైపులా ఎత్తయిన గోడలు నిర్మించారు. అప్పటి వరదలకు పూరానాపూల్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో మూసీ ప్రవహించే ఈ ప్రదేశంలో దాదాపు 60– 70 అడుగులో ఎత్తులో రెండువైపులా గోడలు నిర్మించారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని బస్తీలు సేఫ్‌గా ఉన్నాయి. అదే మూసీ ప్రహించే ప్రదేశాల్లో పురానాపూల్‌కు అటు వైపు. చాదర్‌ఘాట్‌కు ఇటువైపు ఉన్న బస్తీలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ఈ ప్రాంతాల వద్ద గోడలు లేకపోవడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఎక్కువ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe