Breaking News

హ్యుందాయ్‌ ఐ20 సరికొత్తగా వస్తోంది

Oct 28, 2020 13:40 by Admin Admin

హ్యుందాయ్‌ మోటార్స్‌ కంపెనీ తన ఆల్‌-న్యూ ఐ20 బుకింగ్స్‌ను బుధవారం నుంచి ప్రారంభించనుంది.  కస్టమర్లు రూ.21,000 బుకింగ్‌ అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ కోసం అధికార వెబ్‌సైట్‌ను, ఆఫ్‌లైన్‌ బుకింగ్స్‌కు హ్యుందాయ్‌ డీలర్‌షిప్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కంపెనీ సీఈవో ఎస్‌ఎస్‌ మాట్లాడూతూ... భారత్‌లో ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్‌లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్‌-న్యూ ఐ20 నవంబర్‌ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20  ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe