

ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్‌తోనే ప్రారంభమవుతుంది. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.
![]() |
|
![]() |
|
![]() |