Breaking News

నటి మోడల్‌ అర్య బెనర్జీ అనుమానాస్పద మృతి

Dec 12, 2020 15:39 by Admin Admin

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్‌ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’‌లో విద్యాబాలన్‌‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి వెళ్లి చూడగా బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. అయితే నటి ముఖంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe