

రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్ హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన విషయం విదితమే. 1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగరĺ...
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ‘ది డర్టీ పిక్చిర్’లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. ఆమె ఇంటి పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా బెనర్జీ ఎంతకీ స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న కోల్‌కతా పోలీసులు తలుపులు పగలకొట్టి గది లోపలికి &...
నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, వైదేహి నగర్లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్క సెకండ్ పాటు భూమి కంపించి శబ్దాలు రావడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్ కాలనీల్లో భూమి కంపించిన ప్రాంత&...
నగరాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జనావాసాల మధ్య ప్రవహించే మూసీ ప్రదేశాల్లో ఎత్తయిన గోడలు లేకపోవడంతో నీటిలో మునుగుతున్నాయి. 1908లో వచ్చిన వరదల అనంతరం నీటిలో మునిగిన, కొట్టుకుపోయిన బస్తీల వద్ద మూసీ ఇరువైపులా ఎత్తయిన గోడలు నిర్మించారు. అప్పటి వరదలకు పూరానాపూల్ నుంచి చాదర్‌ఘాట్ వరకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో మూసీ ప్రవహించే ఈ ప్రదేశంలో దాదాపు 60– 70 అడ&...
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌తో బుధవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరంలో గత వందేళ్లక&...
రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడ...
దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఆ తరువాత 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభ...
నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్కచేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్ ప్రమాదకరంగా మారింది. దీనిపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ అధికారులు వాహనాలపై వం...
రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరిరువురితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు బెయిలు మంజూరు చేయవద్దంటూ ఎన్సీబీ సోమవారం తన నివ...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలూ, గోదావరి నది పొంగి పొర్లుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణాపురం వద్ద 163వ జాతీయ రహదారిపై చేరిన వరద నీరు చేరింది. చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. పేరూరు వద్ద వరద నీటి మట్టం 15 మీటర్లకు చేడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల...
రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో కోట్లు విలువచేసే ఐదు ఎకరాల భూమిని ఎకరం రూ.5 లక్షల చొప...
కరోనా నుంచి కోలుకొని వేల మంది డిశ్చార్జి అవుతున్నా.. అంతే సంఖ్యలో కొత్తగా బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు మహారాష్ట్రలో 1,47,048 ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాతి స్ధానంలో ఆంధ్రప్రదేశ్.. 87,112 యాక్టివ్ కేసులతో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. రాష్టరంలో కరోనా దెబ్బకు 2036 మij...
![]() |
|
![]() |
|
![]() |