Breaking News

భారత్‌ చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత యూఎన్‌ఓ జోక్యం...
Admin Admin   May 28, 2020

భారత్‌  చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత యూఎన్‌ఓ జోక్యం

భారత్‌-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) స్పందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వివాదాన్ని సద్దుమణిగించేలా ఇరు దేశాలు వ్యవహరించాలని, సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని యూఎన్‌ఓ సూచించింది. ఒకవేళ దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోని పక్షంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సరిచేసుకోవాలని వ్యాఖ్యానించింది.  భారత్‌-చైనా మధ్య తాను మధ్యవర...

Read More

కెనడాలో కాల్పుల చోటుచేసుకుంది...
Admin Admin   April 20, 2020

కెనడాలో  కాల్పుల  చోటుచేసుకుంది

కెనడాలో ఆదివారం కాల్పుల  చోటుచేసుకుంది.  దుండగడు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. ఈ ఘటన కెనడాలోని నోవా స్కోటియా పట్టణంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారు. అయితే పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెంది ఉంటాడని అంతా భావిస్తున్నారు. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇది గత 30 ఏళ్లలో కెనడాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన అని అధికారులు తెలిపారు....

Read More

నేడు కరోనా వివరాలు...
Admin Admin   April 17, 2020

నేడు కరోనా వివరాలు

ప్రపంచ వ్యాప్తంగా 21.82 లక్షలు దాటిన కరోనా కేసులు ఇప్పటివరకు కరోనా నుంచి 5.47 లక్షల మంది కోలుకున్నారు. 1.45 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,759కి చేరింది. ఇప్పటివరకు 1,515 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. 420 మంది కరోనాతో మృతిచెందారు. తెలంగాణలో 700కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్‌ కాగా, 18 మంది మృతిచెందారు. ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు...

Read More

రష్యా ప్రభుత్వాధినేతలకు ఫోన్‌ చేసి ట్రంప్‌ కృతజ్ఞతలు...
Admin Admin   April 14, 2020

రష్యా ప్రభుత్వాధినేతలకు ఫోన్‌ చేసి ట్రంప్‌ కృతజ్ఞతలు

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోకుండా ఉత్పత్తి కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్, పోటీ పడి సౌదీ అరేబియా, రష్యా చమురు ధరలను తగ్గించాయి.  అమెరికా చమురు కంపెనీలు భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్‌ జోక్యంత...

Read More

చైనాలో మళ్లీ వైరస్‌ కలకలం...
Admin Admin   April 13, 2020

చైనాలో మళ్లీ వైరస్‌ కలకలం

చైనాలో మళ్లీ వైరస్‌ కలకలం! శనివారం అక్కడ 99 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 97 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. చైనాలో ఇప్పటివరకూ ఇలా విదేశాల నుంచి వచ్చిన  1280 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది.  చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గి విదేశాల్లో పెరుగుతుండడంతో ప్రభుత్వం వారిని చైనాకు తరలించింది. అలా తరలించిన వేలాదిమందిలో 1280 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింķ...

Read More

కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం...
Admin Admin   April 10, 2020

కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం

కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ సమీపంలోని ఓ ద్వీపం(హార్ట్‌ ఐలాండ్‌)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహిij...

Read More

ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు...
Admin Admin   April 08, 2020

ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు

బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోన్న తరుణంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను అందిస్తున్న మహనీయుడని కొనియాడారు. నాడు లక్ష్మణుడిని హనుమంతుడు సంజీవని ద్వారా కాపాడినట్లే నేడు మానవాళిని మోదీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌తో కాపాడుతున్నారని ప్రశంసించారు. అమెరికాతో సహా అవసరమున్న అన్ని దేశాలకూ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ అందిం...

Read More

నేను మ‌ర‌ణించాననుకోండి నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు...
Admin Admin   March 30, 2020

నేను మ‌ర‌ణించాననుకోండి నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు

అమెరికాలో ఓ డాక్ట‌ర్ చేసిన మెసేజ్ ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన మ‌హిళా డాక్ట‌ర్ క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోంది. ఆమె వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తూ ఓ సందేశాన్నిచ్చింది. ‘నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు. వారు ఈ సందేశం చ‌ద‌వ‌లేరు. నేను మెడిక‌ల్ సూట్‌లో ఉన్నందున క‌నీసం న‌న్ను గుర్తుప‌ట్టనూలేరు. ఒక‌వేళ‌ నేను కోవిడ్‌-19(క‌రోనా వైర‌స్‌) వ‌ల్ల మ‌ర‌ణించాననుకోండి. ఒక్క‌టే నేను కోరుకునేది.. ...

Read More

వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు...
Admin Admin   March 28, 2020

వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు

వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇంటర్ఫెరాన్ ప్రోటీన్‌తో కూడిన స‌మ్మేళ‌నం క‌రోనా ర‌క్కసిని జ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషించ‌నుంద‌ని ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు విశాల్‌ రావు తెలిపారు. సాధార‌ణంగా మానవ శరీర కణాలు వైరస్‌లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, అయితే కోవిడ్‌-19 విష‌యంలో మాత్రం ఇవి ప‌నిచేయండం లేద‌ని , అంతేకాకుండా రోగ నిరోధ‌క శ‌క్...

Read More

5 లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు...
Admin Admin   March 27, 2020

5 లక్షలను మించిన పాజిటివ్‌ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. గురువారంతో 22 వేల మందిపైనే మృతి చెందారు. వైరస్‌ రోగుల సంఖ్య పోటెత్తుతుండటంతో అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కేసులు 75వేలు మించడంతో అమెరికాలో అయితే మూసివేసినవాటిని సైతం తిరిగి తెరుస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆసుపత్రి చేశారు. లూసియానాలో పార్కులను ఐసోలేషన్‌ కేంద్రాల&...

Read More

నాలుగు రోజుల్లో లక్ష మందికి.....
Admin Admin   March 24, 2020

నాలుగు రోజుల్లో లక్ష మందికి..

కరోనా వైరస్‌ వేగాన్ని అందుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గేబ్రేసెస్‌ ప్రకటించారు. ‘‘మొదటి లక్ష కేసుల నమోదుకు 67 రోజులు తీసుకుంది. తర్వాతి లక్ష కేసులు 11 రోజుల్లోనే నమోదయ్యాయి. తదుపరి లక్ష కేసులకు కేవలం నాలుగు రోజులే పట్టింది. అయితే మనం నిస్సహాయులమేమీ కాదు. ఈ మహమ్మారి గతిపథాన్ని మార్చగలం’’అని టెడ్రోస్‌ సోమవారం మీడియాతో పేర్కొన్నారు.  ...

Read More

ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి...
Admin Admin   March 21, 2020

ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి

 ప్రపంచ దేశాలపై ప్రమాదకర  Corono virus కోరలు చాస్తోంది. వైరస్‌ బారిన పడిన మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య పదివేలు దాటగా ఆ సంఖ్య శనివారం ఉదయానికి 11,310కు చేరింది. ఇక 2,72,351 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ఇటలీలో మృతుల సంఖ్య నాలుగువేలకు దాటింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 627 మంది కన్నుమూసినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ అధికారులు ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe